టాబ్లెట్ కంప్యూటర్ల ఉత్పాదక రంగంలోకి తాజా ఎంట్రీ ఇచ్చిన న్యూ బ్రాండ్ ‘ఆరెంజ్ తాహితీ’ సమర్ధతతో కూడిన 7 అంగుళాల టాబ్లెట్‌ను డిజైన్ చేసింది. ఆండ్రాయిడ్ ఆధారిత 3.2.1 ఆపరేటింగ్ సిస్టంను డివైజ్‌లో లోడ్ చేశారు. 7 అంగుళాల వెడల్పయిన డిస్‌ప్లే మల్టీటచ్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అమర్చిన 5 మెగా పిక్సల్ కెమెరా ఫోటోగ్రఫి నైపుణ్యాలను పెంపొందిస్తుంది. దోహదం చేసిన 0.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా ఆప్తులతో లైవ్ వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు తోడ్పడుతుంది. వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ వ్యవస్థలను డివైజ్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని బలోపేతం చేస్తాయి. మైక్రోఎస్డీ, ట్రాన్స్‌ఫ్లాష్ వంటి అదనపు వ్యవస్థలు ద్వారా మెమరీ శాతాన్ని పెంచుకోవచ్చు. సుదీర్ఘమైన బ్యాకప్ నిచ్చే 4000 mAh పవర్ బ్యాటరీని టాబ్లెట్‌లో లోడ్ చేశారు. డివైజ్ బరువు 390 గ్రాములు కావటంతో సులువుగా క్యారీ చేయ్యవచ్చు.
kya baat hai!!!
ReplyDeletenaya tablet ka baath hi......!
ReplyDelete