అడిలైడ్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా తరపున తొలి సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు. కాగా కోహ్లీకిదే తొలి టెస్టు శతకం కావడం విశేషం. నాలుగో టెస్టులో మూడో రోజు గురువారం ఆట విశేషాలు.. - కోహ్లీ, సాహా ఆరో వికెట్‌కు నెలకొల్పిన 114 పరుగుల భాగస్వామ్యం అడిలైడ్‌లో భారత్‌కు మూడో అత్యుత్తమం. - సిరీస్‌లో భారత్ జట్టులో కోహ్లీనే టాప్‌స్కోరర్. 39.71 సగటుతో 278 పరుగులు చేశాడు. తర్వాతి స్థానంలో సచిన్ (274) ఉన్నాడు. -అడిలైడ్‌లో సెంచరీ సాధించిన పదో భారత బ్యాట్స్‌మన్ గా కోహ్లీ నిలిచాడు. -ఆసీస్‌తో ఓ టెస్టు సిరీస్‌లో జహీర్‌కిదే (15 వికెట్లు) అత్యుత్తమ ప్రదర్శన. - టెస్టుల్లో 25 సార్లు డకౌటయిన తొలి భారత ఆటగాడిగా జహీర్ చెత్తరికార్డు నమోదు చేశాడు.
No comments:
Post a Comment