Wednesday, January 25, 2012

స్వచ్ఛమైన ఇండియా నుంచి మన్నికైన టాబ్లెట్ కంప్యూటర్!!


అభివృద్థి దిశగా అడుగులు వేస్తున్న ఇండియా అత్యుత్తమ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లను డిజైన్ చేస్తుంది. బెంగుళూరుకు చెందని ఐటీ సంస్థ డిజిటల్ వేవ్స్ ‘టాబ్‌ప్లస్ రియో’ మోడల్‌లో స్వచ్ఛమైన భారతీయ టాబ్లెట్ కంప్యూటర్‌ను వ్ళద్థి చేసింది. శక్తివంతమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో పటిష్ట శ్రేణిలో రూపుదిద్దుకున్న ఈ దేశీ టాబ్లెట్ పనితీరులో విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఈ డివైజ్ స్ర్కీన్ పరిమాణం 7 అంగుళాలు ఉంటుంది. 5 పాయింట్ టచ్ స్ర్కీన్ సౌలభ్యత ప్రత్యేక అనుభవాన్ని కలిగిస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ స్వభావం హెచ్చుగా ఉన్న గూగూల్ ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టంను డివైజ్‌లో లోడ్ చేశారు. నిక్షిప్తం చేసిన 1 GHz A9 ప్రాసెసర్ ఉన్నత పనితనాన్ని అందిస్తుంది. ఏర్పాటు చేసిన వై-ఫై, 3జీ, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ వ్యవస్థలు డివైజ్ డేటా కనెక్టువిటీ సామర్ధ్యాన్ని పటిష్టితం చేస్తాయి. దోహదం చేసిన 3000 mAh బ్యాటరీ సంవత్సరం వారంటీతో సమర్ధవంతమైన బ్యాకప్ నిస్తుంది. విలువ రూ.10,200.

No comments:

Post a Comment